(Based on Author’s True Life Incidents)

English ‘Universal Language’  కాబట్టి చచ్చినట్టు అన్ని Articles English లో టైపు చేయాల్సి వస్తుంది.  అంటే  English లో అయితే ఎక్కువ మందికి Reach అవ్వుద్ది అని కూడా అనుకోండి!  కానీ ఈ  Article కి మాత్రం తెలుగు లోనే టైపు చేయాలనీ ఫిక్స్ అయ్యా! ఎందుకంటే  Article  పేరు తెలుగు లో ఉంటది కాబట్టి. అంతే కాదు మనకి బాగా కనెక్ట్ అవ్వుద్ది కూడా!

Matter ఏంటంటే, మనకి ఒక రోగం ఉంది. మనకి అంటే మన జనాలకి. Basic గా నేను తెలుగోడిని కాబట్టి తెలుగు జనాలని Example గా తీసుకున్నాను అంతే! ఇంక వేరే ఏ కారణం లేదు. మళ్ళా Racist అనమాకండి పగులుద్ది. సరే ఇంతకి ఆ రోగం ఏంటి అంటే, మన జనాలకి ఎందులో ఐన ఒక Local గ్రూపింగ్ Create చేయడం or ఆ ఫీలింగ్ తీయడం భలే ఇష్టం. ఇలాంటివి కొన్ని నా Life లో జరిగినవి చెప్తా. అవి చదివాక మీకే అర్ధం అవ్వుద్ది మన జనాలు బతకడానికి Create చేసిన ఒక రకమైన ‘గ్రూపింగ్ culture’ ఏంటి అని.

Childish Grouping: నేను  స్కూల్ లో ఉన్నపుడు ఏమైనా గొడవ or Issue అయితే నా classmates వీడు మన బెంచ్ వాడా కాదా అన్నది చూస్తారు. Issue దాని నుండి బైటకి వస్తే Girls ఆ Boys ఆ అని చూస్తారు. ఇంకాస్త బైటకి వస్తే, మన Section ఆ కాదా అని చూస్తారు. ఇంకా బయటకి వస్తే మన Floor ఆ కాదా or మన క్లాస్ ఆ కాదా పోనీ అసలు మన స్కూల్ ఆ కాదా అని చూస్తారు. So దీన్ని Childish గ్రూపింగ్ అనొచ్చు. అంటే తర్వాత ఇంటర్ లో కూడా వీడు MPC ఆ BIPC ఆ etc etc అని గ్రూపింగ్ లు అయ్యాయి అనుకోండి But ఇక్కడ కూడా పెద్ద maturity లేదు కాబట్టి Childish గ్రూపింగ్ లోనే కలిపేద్దాం. ఇదో రక మైన గ్రూపింగ్ culture. ఇది బావుంటది. చిన్న పిల్లలం కదా.

Teenage Grouping: Childish గ్రూపింగ్ కి Adult గ్రూపింగ్ కి మధ్యలో ఉండేదే ఈ Teenage గ్రూపింగ్. అంటే ఈ ఏజ్ లో గొడవలు కొంచం పెద్దవి. ఐన యుక్త(youth) వయసు కాబట్టి Maximum గొడవలు అమ్మాయిల గురించే ఉంటాయి.

‘రేయ్ మన కాలేజీ అమ్మాయి మనకే’ or ‘మీ కాలేజీ అయితే ఏంటి ఉండేది మా రోడ్ లోనే’ లాంటి డైలాగ్ లు బాగా విన్నా. ఇది 50-50 రకం. కొంచం బానే ఉన్న డేంజర్ అన్నమాట.

Adult Grouping: అంటే ఎదో +18 or +21 అనుకునేరు, అదేం లేదు. ఇక్కడ Adult అంటే Matured అని. పెద్ద అయిపోయా కదా. అదేంటో Maturity కొన్ని విషయాలలో మంచిదే అనిపిస్తది Like క్రికెట్ లో మన ఇండియా కి మనవాళ్ళు ఇచ్చే సపోర్ట్ ఫీల్ అయ్యే Patriotism కెవ్వు కేక. కానీ అంతలోనే IPL అని స్టేట్ లు వారీగా కొట్టేసుకుంటారు. మన Caste కాదనుకుంటూనే వాళ్ళ Favorite హీరో కి సపోర్ట్ ఇచ్చేస్తారు. పాలిటిక్స్ బాగా పట్టించుకునే Age కూడా ఇదే. ఇక్కడి నుండే start రచ్చ! చదుకోడానికి, ఉద్యోగం చేయడానికి  Abroad వెళ్లే వాళ్ళు అక్కడ ఉండి కూడా ఇక్కడ జరిగే Agitations కి Political Manifestos కి సపోర్ట్ చేస్తారు. కానీ అక్కడ ట్రంప్ వచ్చి అదే పని చేస్తే తప్పు అంటారు. మళ్ళా Love చేయడానికి Friendship చేయడానికి పనికి రాని Caste పెళ్లి కి పనికివస్తది అదే జరుగుతుంది నా సర్కిల్ లో. సరే Caste గురించి ఒచ్చింది గా టాపిక్. So కింద చుడండి!

Caste Grouping: మనోళ్లు ఎంత చదువుకున్నవాళ్ళైనా ఒకటి మాత్రం మానరు. అదే Caste ఫీలింగ్. “మనోళ్ళేనా” అని టైటిల్ పెట్టటానికి ఇదే కారణం! వామ్మో ఇది గ్రూపింగ్ ల లోనే తోపు గ్రూపింగ్. ఇక్కడ వచ్చినంత యూనిటీ మన జనాలకి ఎక్కడా రాదు! ఐన దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. లేకపోతే ఎవడు పడితే వాడు వచ్చి వాడి మనోభావాలు దెబ్బ తిన్నాయ్ అంటాడు.

Main Point:  ‘మనోళ్ళేనా’ or ‘మనోళ్లు కాదా’ అనే words కి ఎన్ని Meanings ఉన్నాయో తెల్సా?

  • ఇద్దరు same caste వాళ్ళు అనుకుంటే వాళ్ళ caste వాళ్లేనా అని.
  • ఇద్దరు ఆంధ్ర వాళ్ళు అనుకుంటేయ్ తెలంగాణ వాళ్ళు కాదు కదా అని.
  • ఇద్దరు తెలంగాణ వాళ్ళు అనుకుంటేయ్ ఆంధ్ర వాళ్ళు కాదుగా అని.
  • ఇద్దరు తెలుగోళ్లు అనుకుంటే వేరే భాష వాళ్ళేగా అని.
  • ఇద్దరు సౌత్ వాళ్ళు అనుకుంటే నార్త్ వాళ్ళా అని.
  • అలాగే ఇద్దరు ఇండియన్స్ అనుకుంటేయ్ వేరే దేశం వాళ్ళు అని.

Conclusion: Overall గా చెప్పేది ఏంటంటే, మనం బతకడానికి మన పక్కన Situations ని various other things ని మనకి కావలిసినట్టు గా మార్చేసుకుంటున్నాం . ఒక్క word లో చెప్పాలి అంటే Selfishness peaks లో ఉందని.

 “అవసరం ఉన్న చోట నచ్చింది, అవసరం లేని చోట నచ్చకపోడం”.

నేను చిన్నప్పటి నుండి పక్క వాళ్ళల్లో Observe చేసింది ఇదే. నా పైన దీని Impact చాల తక్కువ ఉంది. Basic గా నేను ఈ టైపు కాదు అందుకేనేమో! మీరు కూడా ఒకసారి ఆలోచించుకుని మీలో ఇలాంటి లక్షణాలు కనపడితే, ఇంకెవరికి కనపడనీయకుండా చూస్కోండి. అంటే మానేయండి అని!

`Just Think.